తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం &మార్కాపురం పోలీస్ :-
రహదారి భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ విభాగం రంగంలోకి దిగింది. జిల్లావ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తున్న వాహనదారులపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులు, సీట్‌బెల్ట్ లేని కార్ డ్రైవర్లు, ఓవర్ స్పీడ్ మరియు రాంగ్ రూట్ ప్రయాణాల వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారికి
E-Challanలు జారీ చేస్తున్నారు.కేవలం జరిమానాలు విధించడమే కాకుండా, వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ.. చిన్న నిర్లక్ష్యం ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణికుల ప్రాణ భద్రత కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ నియమాలను పాటించి పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. నిబంధనల అమలులో ఎటువంటి రాజీ లేదని, ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీస్ యంత్రాంగం స్పష్టం చేసింది.