తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-

మార్కాపురం జిల్లా గిద్దలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రై సైకిల్స్ మరియు డస్ట్ బిన్ల పంపిణీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని పచ్చ జెండా ఊపి ట్రై సైకిల్స్ మరియు డస్ట్ బిన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని తెలిపారు. మన గిద్దలూరు మండలానికి 35 రిక్షాలు, గ్రీన్ అంబాసిడరెస్ అయిన మీరు మీకు నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ప్రతి ఒక్కరూ 250 గృహాల నుండి చెత్త సేకరించి పరిశుభ్రం గా ఉంచడంలో మీది ముఖ్య పాత్ర పోషిస్తున్నారు కావున గ్రామాలు, పట్టణాలు శుభ్రంగా ఉండేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ట్రై సైకిల్స్, డస్ట్ బిన్ల పంపిణీతో చెత్త సేకరణ వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని కూటమి ప్రభుత్వం అభివృద్ధి లో ముందు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, సిబ్బంది మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *