తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

డ్రీమ్స్ యంగ్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ట్ ఫెస్ట్ శనివారం విజయవాడలోని తుమ్మలంపల్లి కళాక్షేత్రంలో కోలాహలంగా జరిగింది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి బాల చిత్రకారులు విరివిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండలోని శ్రీ విద్యానికేతన్ విద్యార్థినీ విద్యార్థులకు బంగారు మరియు వెండి పతకాలతో అలరించారు ఇదే స్కూలుకు చెందిన తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి చుండూరి ఇశాంత్ కుమార్ కు ఆల్ ఇండియా బాల చిత్రకళ అవార్డును ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకులు టీజే జనార్దన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డును అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ తెలుగు మరియు సాంస్కృతిక చైర్మన్ ఆర్డి విల్సన్ గారు ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ కల్చర్ కమిషన్ చైర్ పర్సన్ తేజస్వి మరియు నగరంలోని ప్రముఖులు పాల్గొన్నారు గత 25 సంవత్సరములుగా డ్రీమ్స్ ఆర్ట్ అకాడమీ ని నిర్వహిస్తున్నానని ఎందరో విద్యార్థినీ విద్యార్థులు తమ కలలను ప్రదర్శించేందుకు మా సంస్థ వేదిక అయిందని డ్రీమ్స్ ఆర్ట్ అకాడమీ అధినేత రమేష్ వెల్లడించారు అలాగే విద్యానికేతన్ కు బెస్ట్ స్కూల్ అవార్డును అందించడం జరిగింది

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *