తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
తేదీ: 23-02-2026 ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో పొదిలి మండలం తలమల్ల గ్రామానికి చెందిన మితుకుల్ల మమత వారి నాలుగేళ్ల కుమార్తె మోక్షితను హాస్పిటల్‌లో చూపించేందుకు కనిగిరి టౌన్‌లోని సుబ్బారెడ్డి హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. రక్త పరీక్షల నిమిత్తం మమత లోపలికి వెళ్లి తిరిగి వచ్చేసరికి తన కుమార్తె కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు.దీంతో ఆమె కనిగిరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని కనిగిరి సీఐ యు. శ్రీనివాసులు , ఎస్సై జి. సందీప్ పై అధికారులకు తెలియజేసి, సిబ్బందితో కలిసి టౌన్‌లో మరియు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ద్వారా మరియు చుట్టుపక్కల ప్రదేశాలలో క్షుణ్ణంగా పరిశీలించి టౌన్‌లోని మంచినీటి దొరువు వద్ద బాలికను గుర్తించారు. తమ పాపను క్షేమంగా తమ వద్దకు చేర్చిన పోలీస్ అధికారులకు పాప తల్లిదండ్రులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, ఎప్పటికప్పుడు వారిని తమ సమక్షంలోనే ఉంచుకోవాలని తల్లిదండ్రులకు పోలీసులు హితవు పలికారు. తప్పిపోయిన పాపను త్వరగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన కనిగిరి సీఐ మరియు ఎస్ఐలను జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ప్రత్యేకంగా అభినందించారు.