తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, త్రిపురాంతకం సీఐ అస్సన్ గారు సర్కిల్ పరిధిలోని అన్ని సబ్ ఇన్స్పెక్టర్లతో క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెండింగ్లో ఉన్న UI కేసులను తగ్గించడం, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, లోక్ అదాలత్ కేసుల పరిష్కారం, అలాగే సర్కిల్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ను మరింత బలపరచడం వంటి ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.సీఐ అధికారులకు తమ తమ స్టేషన్ పరిధిలో నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, నిందితుల కదలికలపై కచ్చితమైన నిఘా పెట్టాలని సూచించారు. ప్రజల భద్రత కోసం పోలీసులు సమర్థవంతంగా పనిచేసి, శాంతి భద్రతలను కాపాడాలని సమావేశంలో పేర్కొన్నారు.