• చిన్న పిల్లాడి ప్రాణాలు నిలిపిన సీఎంఆర్‌ఎఫ్‌
  • లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ విజయవంతమయి ఆరోగ్యంగా ఉన్న వర్షిత్‌
  • ఎంపీ విపిఆర్‌ను కలిసిన వర్షిత్‌ కుటుంబ సభ్యులు..
  • ప్రాణదాత సీఎం చంద్రబాబు గారికి, విపిఆర్‌ దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు

తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-

పేద ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు అందిస్తున్న సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు లక్షలాదిమంది ప్రాణాలను కాపాడుతున్నాయి. లివర్‌ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇందుకూరుపేటకు చెందిన ఈదురు వర్షిత్‌ అనే బాలుడికి కూటమి ప్రభుత్వం గతేడాది జనవరిలో 10 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు అందజేయగా… లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ పూర్తయి నేడు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని శుక్రవారం కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వివరాల మేరకు ఇందుకూరుపేట మండలం నరసాపురానికి చెందిన ఈదురు మధు, మీనాక్షి దంపతుల చిన్న కుమారుడు వర్షిత్‌(9) లివర్‌ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని జనసేన నాయకులు గుడి హరి రెడ్డి, స్థానిక నాయకులు వేమిరెడ్డి దంపతులకు, డాక్టర్‌ అర్జున్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా.. వెంటనే స్పందించిన వారు.. సీఎంఆర్‌ఎఫ్‌ లో నమోదు చేయించి 10 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ నిధులతో పాటు.. అర్జున్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి ఆపరేషన్‌కు అవసరమయ్యే ఇతర నిధులను, వసతులను సమకూర్చారు. ఈ చెక్కును గతేడాది జనవరి 28న ఎంపీ చేతులమీదుగా అందజేయగా.. అనంతరం ఆపరేషన్‌ పూర్తయి వర్షిత్‌ ఆరోగ్యంగా తయారయ్యారు. ఈ నేపథ్యంలో తమకు ప్రాణదానం చేసిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేస్తూ.. ఇందుకు సంపూర్ణ సహకారం అందించిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని వర్షిత్‌ కుటుంబ సభ్యులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జీవితాంతం రుణపడి ఉంటామని వారు సంతోషం వ్యక్తం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *