తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో అన్నా క్యాంటీన్‌ను టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రారంభించారు.
వారితో పాటు టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, దర్శి మండల తహసీల్దార్ శ్రవణ్ కుమార్ గారు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏ.ఎం.సి చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు గారు, దర్శి, దర్శి మున్సిపల్ ఇంచార్జి కమిషనర్v శ్రీరామమూర్తి గారు తదితరులు ఉన్నారుఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి నుంచి వర్చువల్‌గా 62 అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు కేవలం ₹5కే శుభ్రమైన భోజనం అందించడం ఎంతో గొప్ప సంకల్పమని అన్నారు.ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల నిర్వహణ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ సదుపాయాన్ని దర్శి ప్రజలందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.