తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి మండలం ఉయ్యాలవాడ గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టిడిపి జండా ఆవిష్కరణ మరియు జన్మదిన వేడుకలను గ్రామ టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు టిడిపి జెండాను ఆవిష్కరించి, అనంతరం కేక్ కట్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందని పేర్కొన్నారు.తదుపరి తెలుగు తమ్ముళ్లు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రజలతో కలిసి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, టిడిపి యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, మండల పార్టీ అధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు తదితర ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.అలాగే గ్రామ టిడిపి నాయకులు నాగేండ్ల సుబ్బారావు, రావి శ్రీనివాసరావు, సలపనీడి ప్రసాద్, చెన్నారెడ్డి వెంకటేశ్వర్లు, రావి కోటేశ్వరరావు, రావి రాజేంద్ర, ఉలవ నరసింహారావు, ఒంగోలు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు కాట్రాజు నాగరాజు, నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు, మహిళలు మరియు కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.