తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

కొండేపి నియోజకవర్గ పరిధిలోని సింగరాయకొండ గురుకుల పాఠశాలలో ఈరోజు ఐదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్షలకు హాజరైన విద్యార్థులు మరియు వారితో వచ్చిన తల్లిదండ్రుల కోరకు స్థానిక దేవి సీ ఫుడ్స్ కంపెనీ విశేష దాతృత్వాన్ని ప్రదర్శించింది.ఆదివారం నిర్వహించిన గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష సందర్భంగా పరీక్ష రాయడానికి దూర ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పాహారం మరియు శుద్ధమైన మంచినీటి వసతులను సంస్థ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది.ఇంతటి మంచి కార్యక్రమానికి దేవి సీ ఫుడ్స్ యాజమాన్యం గిరి అనుమతి మేరకు మేనేజర్ కృష్ణ వారి సిబ్బందితో సహా వచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనటం గమనార్హం.విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తమ వంతు బాధ్యతగా భావించి ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన దేవి సీ ఫుడ్స్ సంస్థకు విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.సామాజిక బాధ్యతలో భాగంగా విద్యారంగానికి సహకారం అందిస్తున్న దేవి సీ ఫుడ్స్ సంస్థ ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి తమ సేవాభావాన్ని చాటుకుంది.కార్యక్రమానికి సహకరించిన దేవి సీ ఫుడ్స్ కంపెనీ యాజమాన్యముకు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేయగా న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *