తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ప్రకాశం మరియు మార్కాపురం పోలీసులు అత్యాధునిక ఫింగర్‌ప్రింట్ ఐడెంటిఫికేషన్ నెట్వర్కింగ్ సిస్టమ్ (FINS) సాంకేతికతతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి సమయాల్లో గస్తీని మరింత ఉధృతం చేస్తూ, సమస్యాత్మక ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను ఈ టెక్నాలజీ ద్వారా తనిఖీ చేస్తున్నారు.వేలిముద్రల ఆధారంగా నిందితుల పాత నేర చరిత్రను క్షణాల్లో గుర్తించే వీలుండటంతో, నేరస్థుల కదలికలకు చెక్ పెట్టడం సులభతరమవుతోంది. నిరంతరం గస్తీ తిరుగుతూ, అనుమానితులను విచారిస్తూ ప్రజలు ప్రశాంతంగా నిద్రించేలా పోలీస్ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది. ఆధునిక సాంకేతికతను క్షేత్రస్థాయి పోలీసింగ్‌కు అనుసంధానించడం ద్వారా నేర రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని అధికారులు వెల్లడించారు.