తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్ :-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,ఒంగోలు నగరంలోని సబ్ డివిజన్ కార్యాలయంలో ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు తన పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో (SHOs) సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి పోలీస్ స్టేషన్ వారీగా నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి మరియు పెండింగ్ కేసుల స్థితిగతులను క్షుణ్ణంగా సమీక్షించారు.ముఖ్యంగా దొంగతనాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు మరియు ఎస్సీ, ఎస్టీ కేసులలో విచారణను వేగవంతం చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకూడదని, రౌడీ షీటర్లు మరియు పాత నేరస్థులపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. రాత్రిపూట గస్తీని (Night Patrolling) ముమ్మరం చేయాలని, ప్రజలతో మమేకమై కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించకుండా, బాధ్యతాయుతంగా పనిచేసి నేర రహిత ఒంగోలును తీర్చిదిద్దాలని అధికారులకు స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *