తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

శాంతిభద్రతల పరిరక్షణ మరియు పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) గారి ఆధ్వర్యంలో సర్కిల్ స్థాయి నేర సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో సర్కిల్ పరిధిలోని సబ్ ఇన్స్పెక్టర్లు (SIs), రైటర్లు, అసిస్టెంట్ రైటర్లు మరియు కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.సమావేశం సందర్భంగా సి.ఐ. ప్రతి కేసు యొక్క స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని రైటర్లకు మరియు అసిస్టెంట్ రైటర్లకు సూచించారు. కోర్టు కానిస్టేబుళ్లతో మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న వారెంట్ల అమలు మరియు కోర్టు వాయిదాలకు సాక్షులను సకాలంలో హాజరుపరచడం ద్వారా నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని ఆదేశించారు. నేరాల అదుపునకు గస్తీని ముమ్మరం చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ పారదర్శకమైన విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమని సి.ఐ. స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *