తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం,:-

పాకల బీచ్ ఫెస్టివల్ ని విజయవంతం చేసిన జిల్లా అధికార యంత్రాంగానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ…. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకలలో రెండు రోజులు పాటు నిర్వహించిన బీసీ ఫెస్టివల్ అట్టహాసంగా సాగింది. బీచ్ ఫెస్టివల్ విజయవంతానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికార యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా కార్యక్రమం సజావుగా సాగేలా కృషి చేసిన పోలీసులకు, మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ చేసిన పారిశుద్ధ్య సిబ్బందికి అభినందనలు. జిల్లా అధికారులంతా సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఈ బీచ్ ఫెస్టివల్ లో ప్రజలు కుటుంబ సమేతంగా పాల్గొని సంయమనంతో వ్యవహరించి ఫెస్టివల్ వల్ విజయవంతం అయ్యేందుకు సహకరించిన జిల్లా ప్రజలకు ధన్యవాదాలు. పాకల బీచ్ ను జిల్లాకే తలమానికంగా పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నారని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *