తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :-

పాకాల బీచ్ ఫెస్టివల్‌ను రెండు రోజుల పాటు అహర్నిశలు కృషి చేసి విజయవంతంగా నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బంది, ట్రైనీ కానిస్టేబుళ్లు, హోమ్ గార్డులు మరియు ఎన్‌సీసీ విద్యార్థులను ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ మాట్లాడుతూ ఇరుకైన మరియు సింగిల్ రోడ్ ప్రవేశ మార్గాల్లో ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించడం, వీవీఐపీ మరియు విఐపీ ల కదలికలను సమన్వయం చేయడం, వినోద కార్యక్రమాలు జరిగిన ప్రాంతాల్లో ఎక్కువ మంది సందర్శకుల భద్రతను కల్పించమన్నారు. ముందస్తు ప్రణాళిక, 24 గంటల నిఘా మరియు సముద్రతీర రక్షణ చర్యల వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా చోటుచేసుకోలేదన్నారు. ఎక్కువ మంది ప్రజలు రావటం, ప్రత్యేక కార్యక్రమాలు మరియు వీఐపీ ల రాకపోకలు ఉన్నప్పటికీ సమగ్ర ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, సముద్రతీర భద్రత, భారీ సంఖ్యలో ప్రజలను క్రమబద్ధీకరించడంలో ప్రతి అధికారి సమన్వయంతో పనిచేశారని అన్నారు. భద్రతా ఏర్పాట్లలో సీసీ కెమెరాల, డ్రోన్ కెమెరాలు మరియు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, తక్షణ స్పందన బృందాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ సౌకర్యాలు మరియు ప్రజలకు పబ్లిక్ అట్రాసింగ్ సిస్టం ద్వారా సూచనలు చేశామన్నారు.ప్రజల సహకారం వల్లే కార్యక్రమం సజావుగా పూర్తయిందని పేర్కొంటూ, జిల్లా పోలీస్ శాఖకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని విభాగాల సమిష్టి కృషితో ఈ కార్యక్రమం శాంతియుతంగా, సజావుగా మరియు విజయవంతంగా నిర్వహించబడిందన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *