తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్ :-

ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం మరియు అనుమానాస్పద కార్యకలాపాలను ముందుగానే గుర్తించడం లక్ష్యంగా మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెట్రోల్ బంక్‌ల వద్ద డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు.ఈ ప్రత్యేక నిఘా కార్యక్రమంలో భాగంగా డ్రోన్ల సహాయంతో పెట్రోల్ బంక్‌లు మరియు పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలను గమనించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మరియు రద్దీ సమయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి ఈ ఆధునిక సాంకేతిక పద్ధతిని వినియోగిస్తున్నారు.పెట్రోల్ బంక్‌లు వంటి కీలక ప్రదేశాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా ప్రాంతీయ భద్రతను పెంపొందించడమే కాకుండా, నేరాలను అరికట్టడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సాంకేతికతను వినియోగిస్తూ ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *