తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) పురస్కరించుకుని పొన్నలూరు గ్రామ సమీపంలో మహిళా భద్రత మరియు హక్కులపై పొన్నలూరు ఎస్.ఐ. ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. సమాజంలో మహిళల పట్ల వివక్షను వీడి లింగ సమానత్వాన్ని (Gender Equality) పెంపొందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మహిళా సాధికారత కేవలం ఆర్థికాభివృద్ధితోనే కాకుండా, చట్టాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలు, వేధింపులు మరియు వాటికి సంబంధించిన చట్టపరమైన శిక్షల (Crime Against Women Related Offences) గురించి గ్రామ మహిళలకు క్షుణ్ణంగా వివరించారు. ఈవ్ టీజింగ్, గృహ హింస మరియు సైబర్ వేధింపుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఏదైనా ఆపద కలిగినప్పుడు భయపడకుండా వెంటనే డయల్ 100 లేదా 112 కి సమాచారం అందించాలని, అలాగే పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన సేఫ్టీ యాప్స్‌ను వినియోగించుకోవాలని కోరారు. మహిళల రక్షణే పోలీసుల ప్రధమ ప్రాధాన్యత అని, నేర రహిత గ్రామాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్ఐ పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *