తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జూదం జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిని ఎస్‌ఐ గారి ఆధ్వర్యంలో చేపట్టారు.దాడిలో జూదంలో పాల్గొంటున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 2,140 నగదు మరియు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేసి, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచారు. అక్రమ జూద కార్యకలాపాలను అరికట్టేందుకు ఇలాంటి దాడులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఇటువంటి సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.