తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

పొన్నలూరు ఎస్‌ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వెనుక ప్రాంతంలో బహిరంగంగా మద్యం సేవనం జరుగుతున్న ప్రదేశాలపై ప్రత్యేక క్లీనప్ డ్రైవ్ నిర్వహించారు.ఈ చర్యలో భాగంగా అక్కడ ఉన్న మద్యం బాటిళ్లు, వ్యర్థాలు తొలగించి, ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా మార్చారు. ప్రజా ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్ట విరుద్ధమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ప్రజలు కూడా ఇలాంటి అనైతిక కార్యకలాపాలను నివారించేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన, శుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పోలీసులు కృషి చేస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *