తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పొన్నలూరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసులు జూదం నిర్వహిస్తున్న వారిపై దాడి నిర్వహించారు.ఈ దాడిలో 4 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.4,050 నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదం వంటి అక్రమ కార్యకలాపాలు సమాజానికి హానికరమని పేర్కొన్న పోలీసులు, ఇటువంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ ఘటనకు సంబంధించి పొన్నలూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, చట్టపరమైన తదుపరి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ప్రకాశం జిల్లా పోలీసులు కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *