తొలి శుభోదయం ప్రకాశం:-

జిల్లా ప్రజల నుంచి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులకు వెంటనే పరిష్కారం అందించాలనే లక్ష్యంతో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ , పోలీస్ అధికారులతో కలిసి ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (మీకోసం)’ను నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ఫిర్యాదిదారుల యొక్క వ్రాతపూర్వక వినతులను ఎస్పీ గారు స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి వారి ఫిర్యాదుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని చట్టపరిధిలో పరిష్కరిస్తామని వారికి భరోసా కల్పించారు. అందిన ఆయా ఫిర్యాదులపై ఎస్పీ గారు సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి ఆ ఫిర్యాదులపై తక్షణ విచారణ చేపట్టి, చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోని భాధితులకు న్యాయం అందించాలని, జవాబుదారీతనంతో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా నిర్ణీత గడువులో ఫిర్యాదులు పరిష్కారించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.
ఫిర్యాదు చేయడానికి వచ్చే వృద్ధులు, నడవలేని పరిస్థితిలో ఉన్నవారి సమస్యలను ప్రత్యేకంగా పరిశీలనలోకి తీసుకొని, సంఘటన స్థలాలను సందర్శించి చట్టప్రకారం సత్వర న్యాయం అందించాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్, అత్తరింటి వేదింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో చీమకుర్తి సీఐ ప్రసాద్, పామూరు సీఐ శ్రీనివాసరావు, దర్శి సీఐ రామారావు,వై.పాలెం సీఐ అజయ్ కుమార్, పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, ప్యానెల్ అడ్వొకేట్ బి.బాలాజీ సింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *