తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడిని లక్ష్యంగా చేసుకుని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు దర్శి సీఐ వై. రామారావు, కురిచేడు, దొనకొండ ఎస్సైలు శివ మరియు త్యాగరాజులతో మరియు పోలీసు సిబ్బంది కలిసి కురిచేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని బోధనంపాడు కాలనీలో మరియు పరిసర ప్రాంతాల్లో ‘ఆపరేషన్ వజ్రా ప్రహార్’లో భాగంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.తనిఖీలలో భాగంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఇళ్లు, దుకాణాలు, పాత ముద్దాయిల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 21 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని, కొందరికి చలానాలు విధించారు. ఫింగర్ ప్రింట్ పరికరాలతో అనుమానితులను తనిఖీ చేశారు. రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, మహిళల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో ర్యాలీ నిర్వహించి, గంజాయి నిర్మూలనకు ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. దర్శి సీఐ వై. రామారావు మాట్లాడుతూ గంజాయి మరియు మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, ఉపాధి వంటి వాటిపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ విక్రయం లేదా వినియోగానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలని సూచించారు.గంజాయి వంటి మాదకద్రవ్యాలు సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులు లేదా డైల్112 లేదా పోలీస్ వాట్స్అప్ నెంబర్ 9121102266 తెలియజేయాలని ప్రజలను కోరారు
