తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరులోని టిఆర్ఆర్ డిగ్రీ కాలేజీ ఆవరణలో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేయటంతో.. బాలికలు పడుతున్న అవస్థలు వెలుగు చూశాయి. ఈ హాస్టల్ లో టి ఆర్ ఆర్ కాలేజీకి చెందిన ఇంటర్ మరియు డిగ్రీ విద్యార్థులతో పాటు నర్సింగ్ విద్యార్థినులు సుమారు 200 మందికి పైగా ఉంటున్నారు. ఎమ్మెల్యే తనిఖీకి వెళ్లిన సమయంలో ఇద్దరుకు గాను ఒక్క వార్డెన్ కూడా హాస్టల్లో లేరు.

ముందుగా కిచెన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు, పదార్థాలను పరిశీలించారు. ఎంతమంది బాలికలకు, ఎంత పరిమాణంలో వండుతున్నారు అనే విషయాన్ని ప్రత్యక్షంగా గమనించారు. ఈ సందర్భంగా మెనూ అసలు పాటించడం లేదని ఎమ్మెల్యే కి బాలికలు ఫిర్యాదు చేశారు. ప్రతిరోజు పప్పు, పచ్చడి తోనే సరిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం వేళల్లో ప్రతిరోజు స్నాక్స్ పెట్టడం మానేశారని చెప్పారు. కనీసం బెడ్స్ కూడా తగినన్ని ఇవ్వడం లేదని, అందుకే నేలపై పడుకుంటున్నామని తెలిపారు. ఈలోపు వార్డెన్ లు ఇద్దరు అక్కడికి రావడంతో, వారిపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ లో 200 మంది ఉంటున్నప్పుడు, కనీసం ఒక్కరైనా అందుబాటులో ఉండాల్సిన బాధ్యత లేదా అని గట్టిగా నిలదీశారు. మెనూ ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సరుకులు పంపిణీ చేస్తుంటే, ఎందుకిలా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి హాస్టల్ పరిస్థితిపై ఫిర్యాదు చేశారు. తాను ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళతానని, వార్డెన్లు ఇంత బాధ్యతారాహిత్యంగా ఉండడం సరికాదని ఎమ్మెల్యే అన్నారు.ఎమ్మెల్యే నాగేశ్వరరావు బాలికలతో మాట్లాడుతూ, తన ఫోన్ నెంబర్ మెనూ పట్టికలో రాయిస్తున్నానని, ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా తనకు చిన్న మెసేజ్ చేస్తే వెంటనే హాస్టల్ కు వస్తానని తెలియజేశారు. ఆయన వెంట పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, వార్డు అధ్యక్షుడు నల్లూరు సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *