సంఘటనా స్థలాన్ని పరిశీలించి,సహాయక చర్యల్లో పాల్గొన్న మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో చోటుచేసుకున్న ఘటనపై మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జగిత్యాల నుండి కలిగిరి వెళ్ళు హరికృష్ణ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు AR20D0487 లో 43 మంది ప్రయాణికులు, డ్రైవర్లు ఇద్దరూ మొత్తం 45 మార్కాపురం,రాయవరం వద్ద కు వచ్చేసారికి ఉదయం తెల్లవారుజామున సుమారు 5.45 గంటల సమయంలో పొదిలి వైపు నుండి కంకర్ టిప్పర్ నెంబర్ AP 39UC 5265 ను ఢీకొని దగ్ధమైంది.
ఈ ఘటనలో 14 మృతి చెందగా 29 మంది సురక్షితంగా బయటపడ్డారు. పలువురు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత బస్సుకు మంటలు వ్యాపించాయి. బస్సు అద్దాలను పగులగొట్టడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.ప్రమాద సంఘటన గురించి తెలుసుకున్న జిల్లా ఎస్పీ వెంటనే సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్లు మరియు అంబులెన్సులను పంపించి, తాను కూడా అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలిస్తూ రెస్క్యూ టీంతో కలిసి సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించామని తెలిపారు. అనంతరం బస్సు కిటికీలో నుంచి దూకిన కొందరు ప్రయాణికులకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించి క్షతగాత్రులను పరామర్శించి క్షేమ సమాచారాలను తెలుసుకున్నారు.అక్కడి ప్రయాణికులతో మాట్లాడి కేసు నమోదు చేయడంతో పాటు దర్యాప్తు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు సురక్షితంగా వారి ప్రదేశాలకు వెళ్ళుటకు తగిన ఏర్పాటు చేయడం జరిగింది.
