తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వి.వి. పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని బడేవారిపాలెం గ్రామ శివారులో బహిరంగంగా జూదం (పేకాట) ఆడుతున్నట్లు అందిన నమ్మదగిన సమాచారం మేరకు ఎస్.ఐ. ఆధ్వర్యంలో పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న ముగ్గురు (3) వ్యక్తులను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి జూదానికి ఉపయోగిస్తున్న ₹15,400/- నగదును, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు, జూదానికి పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్.ఐ. హెచ్చరించారు.