తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

పామూరు పట్టణంలోని ప్రజల సౌకర్యం మరియు భద్రత దృష్ట్యా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై పామూరు ఎస్‌ఐ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పట్టణంలోని శివారు ప్రాంతాలు, ఖాళీ స్థలాలు మరియు పాఠశాల పరిసరాల్లో మందుబాబులు స్థావరాలుగా మార్చుకున్న ప్రాంతాలను పోలీసులు క్లీన్ చేశారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల సామాన్య ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ఇలాంటి చర్యలను సహించేది లేదని హెచ్చరించారు. మద్యం తాగిన వారు ఆయా ప్రదేశాల్లో బాటిళ్లను పగులగొట్టడం, గొడవలకు దిగడం వంటి పనులు చేస్తే కఠినమైన కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించే ప్రాంతాలపై నిరంతరం దాడులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *