తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:-
బాపట్ల జిల్లాలో పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో నేడు జిల్లా మలేరియా అధికారి శ్రీ వి నాగార్జున రావు విస్తృతంగా పర్యటించారు. తొలుత బాపట్ల పట్టణంలోని సంజయ గాంధీ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్, తదుపరి బాపట్ల జిల్లా ఇంటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, బాపట్ల జిల్లా కావూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులతో మరియు సిబ్బందితో సమావేశమై కిటక జనిత వ్యాధుల నియంత్రణలో పకడ్బందీ వ్యూహాన్ని అనుసరించాలని ఆయన కోరారు. పిహెచ్సి పరిధిలో పరిశుభ్రత పాటించాలని, ఫీల్డ్ లొ క్షేత్రస్థాయి సిబ్బంది వెక్టార్ హైజిన్ యాప్ ను ఉపయోగించి నివేదిక అందజేయాలన్నారు. ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగాఅమలు చేసేలా చూసే బాధ్యత వైద్యాధికారులదే అన్నారు. తదుపరి ఆయన ప్రతి పిహెచ్సిలో ల్యాబ్ లను సందర్శించి ల్యాబ్ టెక్నీషియంతో రక్త పరీక్షలు జరుగుతున్న తీరును నిశితంగా అడిగి తెలుసుకున్నారు.మలేరియా రక్తపూత పరీక్షలను అత్యంత జాగ్రత్తగా పరీక్ష చేయాలని క్షేత్రస్థాయి నుంచి వచ్చే రక్తపూత నమూనాలను వెంటనే పరీక్ష చేయాలన్నారు.