తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు.ట్రాఫిక్ నియమాలు మరియు నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనదారులపై e-చలాన్ విధిస్తూ, అదే సమయంలో వారికి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ చర్యల ద్వారా నిబంధనలు పాటించే బాధ్యతను ప్రతి వాహనదారుడిలో పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి,
నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి అని పోలీసులు సూచించారు. అలాగే మద్యం సేవించి వాహనం నడపరాదు, రాంగ్‌రూట్‌లో ప్రయాణించరాదు, వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు వెంట ఉంచుకోవాలని తెలియజేశారు.ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని, ప్రజల సహకారంతో సురక్షితమైన ప్రకాశం జిల్లాను నిర్మించవచ్చని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *