తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
కొత్తపట్నం మండలం మడనూరు గ్రామంలో జరుగుతున్న రథోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సింగరాయకొండ సీఐ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బందోబస్తుకు హాజరైన పోలీస్ సిబ్బందికి ఆయన విధి నిర్వహణపై కీలక సూచనలు చేస్తూ బ్రీఫింగ్ ఇచ్చారు.రథోత్సవ సమయంలో తోపులాటలు జరగకుండా చూడాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు మరియు చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ఉత్సవం ప్రశాంతంగా ముగిసేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సీఐ స్పష్టం చేశారు.