తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రోత్ సెంటర్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న జూదపు తావులపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మద్దిపాడు ఎస్ఐ (SI) మరియు వారి సిబ్బంది పక్కా సమాచారంతో ఈ సోదాలు చేపట్టారు.ఈ దాడుల్లో జూదం ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 15,600/- నగదును మరియు జూదానికి ఉపయోగించిన ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. గ్రోత్ సెంటర్ వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై నిరంతరం నిఘా ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు.