తొలి శుభోదయం న్యూస్ మద్దిపాడు:-

ఒంగోలు డీఎస్పీ మద్దిపాడు పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులను సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించి, శుభ్రత, క్రమశిక్షణ, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు.చట్టసంబంధిత కేసుల నమోదు, రికార్డుల అప్‌డేషన్, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎస్‌ఐ మరియు సిబ్బందికి అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.ప్రజలకు మెరుగైన పోలీసింగ్ అందించేలా విధులు నిర్వర్తించాలని, స్టేషన్ పనితీరును మరింత సమర్థవంతంగా నిర్వహించాలని డీఎస్పీ సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *