తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

గుడ్లూరు పంచాయతీలోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు ఎమ్మెల్యే కి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే కి ఆలయ అధికారులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా స్వామివారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులందరూ భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రి పండుగను జరుపుకోవాలని, భోళాశంకరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గుడ్లూరు అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *