తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి:-

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని మున్నంగి సీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సార్డ్స్ శ్రీంప్ సైనర్జీ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళా ఉద్యోగుల కోసం ఉద్యోగ ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ముఖ్యంగా సెక్సువల్ హరస్మెంట్ అఫ్ ఉమెన్ ఏట్ వర్కప్లేస్,ప్రెవేన్షన్ , ప్రోహిబిషన్ అండ్ రెడ్రెస్సల్ యాక్ట్ , 2013 పై ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నేటి కాలంలో మహిళలు ఉద్యోగ ప్రదేశాల్లో ఎదుర్కొనే లైంగిక వేధింపులను ధైర్యంగా ఎదుర్కొని, తమ హక్కులను చట్టపరంగా వినియోగించుకోవాలని సూచించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం పలు చట్టాలు తీసుకువచ్చిందని, ఉద్యోగ ప్రదేశాల్లో గౌరవం మరియు భద్రత కల్పించడం ప్రతి సంస్థ బాధ్యత అని ఆయన తెలిపారు.అదేవిధంగా ఈ ట్రైనింగ్‌లో మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపులు ఏమిటి, వాటిని ఎలా గుర్తించాలి, ఎలా నిరోధించాలి, సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది శ్రింప్ వర్కర్స్ పాల్గొని కార్యక్రమాన్ని ఆసక్తిగా వినిపించారు.ఈ కార్యక్రమంలో సఖి వన్ స్టాప్ సెంటర్ లాయర్ స్పందన,మున్నంగి సీ ఫుడ్స్ హెచ్‌.ఆర్ మేనేజర్ దస్తగిరి, సీనియర్ టెక్నికల్ మేనేజర్ బి.వి.ఎస్.ఎన్. రాజు, సార్డ్స్ శ్రీంప్ సైనర్జీ ప్రాజెక్ట్ స్టేట్ మేనేజర్ వికాస్,,డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహిళలు తమ హక్కులపై అవగాహన పెంపొందించుకొని, ఉద్యోగ ప్రదేశాల్లో భద్రతతో మరియు గౌరవంతో పనిచేసే వాతావరణం కల్పించాలని పలువురు అభిప్రాయపడ్డారు.మహిళా కార్మికులు కార్యక్రమనంతరం కేకు కటింగ్ తో ఆనందం పంచుకున్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *