తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
మహిళలు మరియు విద్యార్థినుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ‘శక్తి యాప్’ (Shakti App) పై ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసులు కళాశాలలు, రద్దీ ప్రాంతాల్లో మహిళలకు యాప్ పనితీరును వివరించారు.ఆపద సమయంలో లేదా గుర్తు తెలియని వ్యక్తుల నుండి ముప్పు పొంచి ఉన్నప్పుడు యాప్‌లోని SOS బటన్‌ను నొక్కితే, వెంటనే సమాచారం కంట్రోల్ రూమ్‌కు చేరుతుందని, తద్వారా నిమిషాల వ్యవధిలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటారని అధికారులు వివరించారు. ప్రతి మహిళా తమ స్మార్ట్ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని, తద్వారా తమకు తాము రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.