తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,మహిళలు, విద్యార్థినుల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా భావిస్తూ ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా ‘శక్తి’ (Shakti) యాప్ పై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు ఈ యాప్ ఒక డిజిటల్ రక్షణ కవచంలా పనిచేస్తుందని తెలిపారు.స్మార్ట్‌ఫోన్‌లో శక్తి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని, ఆపద సమయంలో కేవలం ఒక బటన్ నొక్కితే బాధితురాలి లొకేషన్ నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు చేరుతుందని, దీంతో పోలీసులు తక్షణమే స్పందించి సహాయం అందించగలుగుతారని వివరించారు.కళాశాలలు, పాఠశాలలు, రద్దీ ప్రాంతాలు, ప్రజా ప్రదేశాల్లో శక్తి టీమ్స్ విస్తృతంగా పర్యటిస్తూ విద్యార్థినులు, మహిళల మొబైల్ ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి, దాని వినియోగ విధానం, ప్రయోజనాలపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు.మహిళలు నిర్భయంగా జీవించే వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని, ప్రతి మహిళ తప్పనిసరిగా శక్తి యాప్‌ను వినియోగించాలని పోలీసులు పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *