తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, మహిళల గొప్పతనాన్ని మరియు సమాజంలో వారి ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పాఠశాల మరియు కళాశాల విద్యార్థినీ విద్యార్థులకు జిల్లావ్యాప్తంగా వ్యాసరచన (Essay Writing), వక్తృత్వ (Elocution), మరియు చిత్రలేఖన (Drawing) పోటీలను నిర్వహించారు.మహిళా సాధికారత, భద్రత మరియు సామాజిక మార్పులో మహిళల పాత్ర వంటి అంశాలపై నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. నేటి తరం యువతలో మహిళా హక్కులు మరియు భద్రతపై అవగాహన కల్పించేందుకే ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విజేతలకు మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అటు విద్యార్థుల్లో చైతన్యం, ఇటు పోలీసు శాఖ పట్ల ప్రజల్లో నమ్మకం మరింత బలపడుతుందని అధికారులు ఆకాంక్షించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *