తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-

  2026 మే నెల 5, 6వ తేదీలలో జరుగు రైతు సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ రైతు సంఘం నాయకులు ప్రజాసంఘాల కార్యాలయంలో జిల్లా మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. మార్కాపురం జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు పిల్లి తిప్పారెడ్డి మాట్లాడుతూ  జిల్లా స్థాయి మొదటి మహాసభలు మార్కాపురంలో జరుగుతున్నాయని, ఈ మహాసభలు జయప్రదం చేసేందుకు రైతులు, ఉద్యమ శ్రేయోభిలాషులు తోడ్పాటున అందించి జయప్రదం చేయాలని కోరారు. మార్కాపురం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు అత్యంత తీవ్రంగా వెనుకబడ్డాయని, నిత్యం కరువు కాటకాలతో వెనుకబడిన మార్కాపురం జిల్లా వరప్రసాద్ని అయిన శ్రీ పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ను పూర్తి చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని అన్నారు. 2026వ సంవత్సరం జూలై నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వ మాటను నిలబెట్టుకోవాలని,గతంలో లాగా వాయిదాల పర్వానికి తెరదించకూడదని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మహాసభలలో మార్కాపురం జిల్లాలోని 21 మండలాల నుండి రైతు సంఘం ప్రతినిధులు, కార్యకర్తలు హాజరవుతున్నారని, ఈ మహాసభలకు ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,ఆల్ ఇండియా కిసాన్ సభ అఖిలభారత నాయకులు ఈ మహాసభలకు హాజరవుతారని తెలియజేశారు. కరపత్రం ఆవిష్కరించిన వారిలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దగ్గుపాటి సోమయ్య, రైతు సంఘం సీనియర్ నాయకులు గాలి వెంకటరామిరెడ్డి, గిద్దలూరు నియోజకవర్గ రైతు సంఘం నాయకులు రామకృష్ణ, పెద్దదోర్నాల మండలం రైతు సంఘం కార్యదర్శి దుగ్గెంపూడి తిరుపతిరెడ్డి, మార్కాపురం మండల రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఓర్సు అడవయ్య, గంగిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, తర్లపాడు మండల రైతు సంఘం కార్యదర్శి ఏరువ పాపిరెడ్డి, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు జవాజి రాజు సిఐటియు మార్కాపురం మండల కార్యదర్శి జె నాగరాజు తదితరులు మహాసభ కరపత్రం ఆవిష్కరించిన వారిలో ఉన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *