తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
ప్రకాశం మార్కాపురం జిల్లా పట్టణంలోని కోర్టు సెంటర్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు మానవహారం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో తమ జీతాలు, సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీలను తెల్లవారుజామున అరెస్టు చేసి, వారు ఎక్కడ ఉన్నారో కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయకపోవడం అన్యాయమని మండిపడ్డారు. గతంలో తాము ధర్నాలు చేసినప్పుడు తమ వద్దకు వచ్చి హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మహిళలకు అండగా ఉంటామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు మహిళలపైనే కఠిన చర్యలు తీసుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. వెంటనే చర్చలకు పిలిచి తమ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో అమరావతిని ముట్టడిస్తామని హెచ్చరించారు.