తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం పాదయాత్రగా వెళ్తున్న శివభక్తుల ఆరోగ్య పరిరక్షణ కోసం Lee Pharma సహకారంతో ఏలూరి లక్ష్మీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద దోర్నాల పట్టణంలో ఈ నెల 14వ తేదీ నుండి ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించిన విషయం తెలిసిందే. భక్తుల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ మహత్తర సేవా కార్యక్రమం భక్తులకు ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మెడికల్ కిట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా పెద్ద దోర్నాలలో నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశ్యం, భక్తులకు అందిస్తున్న వైద్య సేవలు, ఉచిత మందుల పంపిణీ, వైద్య పరీక్షలు తదితర వివరాలను ఎమ్మెల్యేకి వివరంగా తెలియజేశారు. ఈ సేవా కార్యక్రమం గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే కందుల.. ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. మహాశివరాత్రి సందర్భంగా పాదయాత్రగా వెళ్లే శివభక్తులకు వైద్య సేవలు అందించడం ఒక గొప్ప సేవా కార్యక్రమమని, భక్తుల ఆరోగ్య రక్షణ కోసం ట్రస్ట్ తీసుకున్న ఈ కార్యక్రమం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. భక్తుల పట్ల సేవాభావంతో పనిచేస్తున్న ట్రస్ట్ సభ్యుల సేవాస్ఫూర్తి ప్రశంసనీయమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు..ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ మాలపాటి వెంకటరెడ్డి, మాజీ చైర్మన్ రీ గుంటక సుబ్బారెడ్డి, మండల టిడిపి అధ్యక్షుడు కాకర్ల శ్రీనివాసులు, ట్రస్ట్ సభ్యులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.శివుని దివ్య ఆశీస్సులతో, “మానవ సేవే మాధవ సేవ” అన్న భావనతో నిర్వహిస్తున్న ఈ మెగా మెడికల్ క్యాంపు భక్తుల ఆరోగ్యానికి అండగా నిలుస్తూ సేవాస్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తోంది.