తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని పాఠశాలలలో అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా శుక్రవారం అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అగ్నిమాపక శాఖ అధికారి చంద్రశేఖర్ రావు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో అగ్నిప్రమాదాలు జరిగిన సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులకు వారు వివరించి చెప్పారు. విద్యార్థులు ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో మంటలు అంటుకున్నప్పుడు వాటిని ఎలా అర్పాలో విద్యార్థులకు తెలిపారు. ప్రమాదాలు జరిగినప్పుడు ముఖ్యంగా ధైర్యంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.