ఇటీవల 250 మంది అంబేద్కర్ గురుకులాల TGTలకు PGTలుగా ప్రమోషన్లు కల్పించిన కూటమి ప్రభుత్వం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి డిఎస్ బీవీ స్వామికి కృతజ్ఞతలు తెలిపిన PGTలు
తొలి శుభోదయం న్యూస్ విశాఖ:-
విద్యార్దుల సంక్షేమంతో పాటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. రాష్ట్రంలోని అంబేద్కర్ గురుకులాల్లో పనిచేస్తున్న 250 మంది TGT లకు PGT లుగా ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించింది. ఈ సంధర్బంగా ప్రమోషన్లు పొందిన ఉఫాధ్యాయులు మంగళవారం నాడు విశాఖలో మంత్రి డిఎస్ బీవీ స్వామిని కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంధర్బంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…కూటమి ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమంతో పాటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంది. విద్యార్థుల విద్య, ఆరోగ్యంపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రాష్ట్రంలోని అన్ని అంబేద్కర్ గురుకులాల్లో విద్యార్థులు ఐఐటీ, నీట్ లో సీట్లు సాధించేలా వారిని తీర్చిదిద్దాలి. అమ్మ నాన్నల ప్రేమకు దూరంగా ఉంటూ హాస్టళ్లలో ఉండి చదుకుంటున్న విద్యార్దులను ఉఫాధ్యాయులు సొంత పిల్లల్లా చూసుకోవాలని మంత్రి చెప్పారు. పేద విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగా ఉపాధ్యాయులు పేద పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిద్దాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.