తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరులో అబ్దుల్ రెహ్మాన్,వయసు(80)అనే వృద్ధుడికి ఈమధ్య వయసు రీత్యా ఎముకలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయనకు దగ్గరగా ఎవరు లేరు, ఉన్నకొడుకు మతిస్థిమితం లేక ఉన్నాడు. ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ వారు ఒంగోలు హాస్పిటల్ లో చూపించగా కొన్ని రోజులు మందులు,ఇంజెక్షన్స్, డైలీ చికిత్స అవసరం అని డాక్టర్ సూచించారు. అయితే చికిత్స కోసం అవసరం అయ్యే ఆర్ధిక పరిస్థితి లేని వృద్ధుడికి కందుకూరు పట్టణంలో మొబైల్ రంగంలో, సేవా రంగంలో, తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న, అడిగిన వెంటనే లేదు అనకుండా సహాయం అందించే స్నేహశీలి,మృదుస్వభావి
కందుకూరు పట్టణ మొబైల్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ సలాం భాయ్ గారు (స్టూడెంట్స్ మొబైల్ అధినేత), విషయం తెలుసుకొని నేనున్నాను అంటూ ముందుకు వచ్చి వృద్ధుడి చికిత్స కోసం 15000/- ఆర్ధిక సహాయం ఫౌండేషన్ సెక్రటరీ షంషేర్ కి అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు సలాం కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వెంటనే వృద్ధుడి చికిత్సకి వినియోగిస్తాం అని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *