పోలీస్ స్టేషన్‌లోని నిర్వహించే పలు రికార్డులు పరిశీలన….. నమోదైన కేసులపై ఆరా
ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పోలీస్ శాఖపై మరింత నమ్మకం పెంపొందించేలా ఉత్తమ సేవలు అందించాలి:జిల్లా ఎస్పీ
చట్ట వ్యతిరేక,అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టి నివారించాలి
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్
వెలిగండ్ల మరియు చంద్రశేఖరపురం పోలీస్ స్టేషన్లను బుధవారం తనిఖీ చేసి, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్‌లోని పలు రికార్డులను తనీఖీ చేయడంతో పాటు, స్టేషన్ పనీతీరుతో పాటు, స్టేషన్ పరిధిలో ఏలాంటి నేరాలు జరుగుతాయి, ఎంత మంది చెడు నడతగలిగిన వారు వున్నారు, స్టేషన్ సిబ్బంది మొదలైన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.రికార్డుల నిర్వహణలో ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంచాలని, సమగ్రత పాటించాలని, కేసులు త్వరితగతిన పరిష్కరించడంతో బాధితులకు సత్వర న్యాయం అందించగలమని తెలిపారు. ప్రతి కేసు సమయంలో జాప్యం లేకుండా బాధితులకు సత్వర సహాయం అందించాలన్నారు. సమస్యతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు.మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి రక్షణ కల్పించేందుకు ముమ్మరంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మహిళలకు భద్రత పెంపొందించాలన్నారు.విద్యాసంస్థలలో శక్తి టీమ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, ప్రధాన సెంటర్లలో, జన సమూహాల అధికంగా ఉండే ప్రాంతాలలో, వ్యాపార సముదాయాల వద్ద మరియు నిర్మానుష్య ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.పోలీసు స్టేషన్ పరిధిలోని చెడు నడతగలవ్యక్తుల వేలిముద్రలను అప్ డేట్ చేస్తూ, వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. పాత నేరస్థులపై నిఘా ఉంచాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని, సైబర్ నేరాలను నియంత్రించుటకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.బహిరంగ మద్యపానం జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి, అక్కడ క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఆ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ సిబ్బంది సహకారంతో శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.రహదారి ప్రమాదాల నివారణకు విశిష్ట కృషి చేస్తూ, బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, రహదారి భద్రతా ప్రమాణాలు ప్రతి ఒక్కరు పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో రాత్రిపూట గస్తీని ముమ్మరం చేయాలని, గ్రామస్తులతో మమేకమవుతు సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని సూచించారు.స్టేషన్ ఆవరణలో మొక్కల నాటి స్టేషన్ ఆవరణములను పరిశుభ్రం ఉంచుకోవాలని సూచించారు
జిల్లా ఎస్పీ వెంట ఎస్ బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ దేవ ప్రభాకర్, పామూరు సిఐ ఎం.శ్రీనివాసరావు మరియు సిబ్బంది ఉన్నారు.
