తొలి శుభోదయం న్యూస్ అమరావతి :-
కాకినాడజిల్లా వేట్లపాలెం పేలుడు ఘటన పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ….పేలుడు ఘటనలో 21మంది చనిపోవడం అత్యంత దురదృష్టకరం. బాణసంచా తయారీ కేంద్రంలో ఊహించని పేలుడు చోటుచేసుకోవడం, ఆ పేలుడు ధాటికి మృతదేహాలు, శరీర భాగాలు ఎగిరిపడ్డాయన్న విషయం మనసును తీవ్రంగా కలిచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తోంది. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.