తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రకాశం జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ నేరాల నియంత్రణలో సరికొత్త దిశగా ముందుకెళ్తున్నారు. జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో ‘MSCD’ (Mobile Scene of Crime Device) పరికరాల ద్వారా అనుమానితుల వేలిముద్రలను సేకరించి, వెంటనే డిజిటల్ డేటాబేస్‌తో సరిపోల్చి వారి నేర చరిత్రను క్షణాల్లో గుర్తిస్తున్నారు.బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ కూడళ్లు వంటి కీలక ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ, పాత నేరస్తులను వేగంగా గుర్తించే చర్యలు చేపట్టారు. ఈ ఆధునిక విధానం ద్వారా నేరాల నియంత్రణలో వేగం పెరగడంతో పాటు, దర్యాప్తు ప్రక్రియలో ఖచ్చితత్వం కూడా గణనీయంగా మెరుగుపడుతోంది.‘స్మార్ట్ పోలీసింగ్’ దిశగా అడుగులు వేస్తూ, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంలో పోలీసులు కృషి చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరుతున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *