తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణం గుర్రం వారి పాలెం లోని శ్రీ సంస్కృతి స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని “మహిళా సాధికారత- దేశాభివృద్ధి” అనే నినాదంతో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళల గొప్పతనాన్ని తెలిపేలా నృత్య రూపకాలు,నాటికలు మరియు గీతాలను ఆలపించారు. ముఖ్యంగా “నారీ శక్తి “థీమ్ తో చేసిన ప్రదర్శన అందరిని ఆకట్టుకున్నది. ఈ సందర్భంగా పాఠశాలలో ఉత్తమ సేవలందించిన మహిళా ఉపాధ్యాయులను మరియు సిబ్బందిని యాజమాన్యం ఘనంగా సన్మానించింది.ఈ సందర్భంగా చైర్మన్ కొంకా చంద్రశేఖర్ మాట్లాడుతూ” ఒక పురుషుడు చదువుకుంటే ఒక వ్యక్తి మాత్రమే అభివృద్ధి చెందుతాడు కానీ ఒక మహిళ చదువుకుంటే మొత్తం కుటుంబమే విజ్ఞానవంతం అవుతుంది.” సంస్కృతి పాఠశాలలో విద్యార్థులను కేవలం విద్యార్థులుగా కాకుండా, రేపటి తరం నాయకురాళ్ళుగా తీర్చిదిద్దుతున్నామని తెలియపరిచి అహర్నిశలు శ్రమిస్తున్నమహిళ ఉపాధ్యాయులను మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హరి వైస్ ప్రిన్సిపాల్ శోభారాణి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.