తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్, మోడల్ ప్రదర్శనలు వంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గారైన డాక్టర్ గీతా రాణి మాట్లాడుతూ,భారత ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్. కనుగొన్న “రామన్ ప్రభావం”ను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. శాస్త్ర విజ్ఞానం దేశ అభివృద్ధికి మూలాధారం.మన రోజువారీ జీవితంలో ఉపయోగించే మొబైల్ ఫోన్ నుండి వైద్యశాస్త్రం వరకు ప్రతీ రంగంలో శాస్త్ర విజ్ఞానం కీలక
పాత్ర పోషిస్తోంది. శాస్త్రం మనకు ప్రశ్నించడం, ఆలోచించడం నేర్పిస్తుంది.కొత్త విషయాలను కనుగొనడానికి ప్రేరేపిస్తుంది.
మన దేశం సైన్స్ రంగంలో ఎన్నో విజయాలు సాధించింది. ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనలో ఇస్రో ప్రపంచంలోనే గౌరవప్రదమైన స్థానం సంపాదించింది. చంద్రయాన్, మంగళయాన్ వంటి ప్రయోగాలు మన దేశ గర్వకారణాలు.విద్యార్థులు పరిశోధనాత్మక దృక్పథం పెంపొందించుకొని, శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధిని సాధించాలి అని సందేశాన్ని ఇచ్చారు.
