తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరు నుంచి సింగరాయకొండ రైల్వే స్టేషన్ వరకు నైట్ బస్ సర్వీసు ను ప్రయాణికులు వినియోగించుకోవాలని స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్ రాపూరి శ్రీనివాసులు అన్నారు. స్థానిక సిబ్బంది తో సమావేశము మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందుకూరు నుంచి రాత్రి 9 గంటలకు, ఒంగోలు నుంచి 11 గంటలు, కందుకూరులో 1 గంట, సింగరాయకొండలో 2 గంటలు, కందుకూరులో3 గంటలు, సింగరాయకొండలో 4 గంటలకు ఆయా రైలు రాకపోకలు చేసే సమయాలలో ప్రయాణికుల సౌకర్యార్థం కొరకు బస్సు సర్వీసును నడుపుతున్నామని చెప్పారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సు సర్వీస్ సేవలను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. సమావేశములో ట్రాఫిక్ సిఐ శ్యామ్ ప్రసాదు, ఏవో మూర్తి, తదితరులు పాల్గొన్నారు.