తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

మహిళలు మరియు యువతుల భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి, మహిళలకు ‘శక్తి’ (Shakthi App) యాప్ యొక్క ప్రాధాన్యతను వివరించారు. ముఖ్యంగా కళాశాల విద్యార్థినులు, ఉద్యోగినులు మరియు గ్రామీణ మహిళలతో మాట్లాడి, వారి మొబైల్ ఫోన్లలో ఈ యాప్‌ను స్వయంగా డౌన్‌లోడ్ చేయించారు.ఆపద సమయంలో కేవలం ఒక్క బటన్ నొక్కడం ద్వారా లేదా ఫోన్‌ను వేగంగా ఊపడం ద్వారా (Shake) సమాచారం నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్‌కు చేరుతుంది.బాధితురాలి ఖచ్చితమైన లొకేషన్ పోలీసులకు చేరడం వల్ల వేగంగా స్పందించే అవకాశం ఉంటుంది.అత్యవసర సమయంలో కుటుంబ సభ్యులకు కూడా అలర్ట్ మెసేజ్ వెళ్లే సౌకర్యం ఉంది.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, మహిళలు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు లేదా ఏదైనా ఆపద కలిగినప్పుడు భయం వీడి శక్తి యాప్‌ను ఉపయోగించాలని సూచించారు. “మీ రక్షణ మా బాధ్యత” అని తెలుపుతూ, ప్రతి ఇంట్లో మహిళలకు ఈ యాప్‌పై అవగాహన కల్పించాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *