తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

సింగరాయకొండలో స్మార్ట్‌జెన్ విద్యాసంస్థలో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం మరియు సాంస్కృతిక వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించబడినాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులు గౌరవనీయులు ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సిలర్ ప్రొఫెసర్ డి వి ఆర్ మూర్తి గారు, గౌరవ అతిథులు హేమస్వి కద కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, స్మార్ట్‌జెన్ విద్యాసంస్థల అధినేత శ్రీ శ్రీనివాస్ గారు, కరస్పాండెంట్ డాక్టర్ గీతారాణి , జనరల్ మేనేజర్ శ్రీ హరిప్రసాద్ , ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు భారీగా హాజరై వేడుకను విజయవంతం చేశారు.స్మార్ట్‌జెన్ సి బి ఎస్ యి పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ మధుకర్ వార్షిక నివేదికను చదివి వినిపించారు.గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో విద్యార్థులకు సర్టిఫికెట్లు మరియు మెమెంటోలు ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సిలర్ ప్రొఫెసర్ డి వి ఆర్ మూర్తి గారు ప్రదానం చేశారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఆచరణే విద్యార్ధులకు అభ్యాసం అవ్వాలని, సత్యమే మాట్లాడడం నేర్పించాలని, కథనం వ్యాఖ్యానం అలవాటుచేసుకోవాలని తెలియజేశారు. గ్రాడ్యుయేషన్ కార్యక్రమం నిర్వహణ పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ హేమస్వి కద మాట్లాడుతూ స్మార్ట్‌జెన్ విద్యాసంస్థలో ఆరోగ్యకరమైన విద్యార్థులు ఆరోగ్యకరమైన వాతావరణంలో విద్యనభసిసున్నారని అన్నారు.
స్మార్ట్‌జెన్ చైర్మన్ శ్రీ శ్రీవాస్ మాట్లాడుతూ
జీవితంలోని ప్రతి రంగంలో లక్ష్యాలు ఎంతో అవసరం. లక్ష్యాలు లేకపోతే ఎలాంటి సానుకూల ఫలితాలు సాధ్యం కావు. నిజానికి, లక్ష్యాలు ప్రక్రియను ఉత్సాహభరితంగా మరియు సులభంగా మారుస్తాయని తెలియజేశారు. కాబట్టి ఆయనే ప్రతి రోజు స్వయంగా విద్యార్ధులకు వారి వారి గమ్యాన్ని గుర్తుచేస్తుంటారని తెలియజేశారు.కరస్పాండెంట్ డాక్టర్ గీతారాణి మాట్లాడుతూ నిరంతర అభ్యాసం మనలను నైపుణ్యం కలిగిన వారిగా మారడానికి సహాయపడుతుందని తెలియజేశారు. మరియు పిల్లలలో ఉన్న నైపుణ్యాలను వారి గమ్యాలను దృష్టిలోవుంచుకొని వారు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నారో AI ద్వారా ప్రదర్శించి విద్యార్ధులను మరియు వారి తల్లిదండ్రుల ప్రశంసలు పొందారు. తదుపరి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు నృత్యాలు, నాటికలు, పాటలు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా దేశభక్తి, సంప్రదాయం, సామాజిక విలువలను ప్రతిబింబించే ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ వేడుక పాఠశాల విద్యా ప్రమాణాలు మరియు విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబిస్తూ అందరి ప్రశంసలను అందుకుంది. కార్యక్రమం చివరలో నిర్వాహకులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *