తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-

కనిగిరి పట్టణంలో మే 10వ తేదీన నిర్వహించ తలపెట్టిన హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన ఆహ్వాన పత్రిక ను మరియు బైక్ స్టిక్కర్లను సోమవారం కనిగిరిలోని అమరావతి గ్రౌండ్స్‌లో గల టీడీపీ కార్యాలయంలో కనిగిరి ఎమ్మెల్యే మరియు ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆవిష్కరించారు.​ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఈ శోభాయాత్ర కేవలం ఒక ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదని, హిందువులందరి ఆత్మగౌరవానికి మరియు ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. “హిందువులందరూ కులమతాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి, పెద్ద ఎత్తున పాల్గొని మన ఐక్యతను చాటుతూ ఈ యాత్రను విజయవంతం చేయాలని” వారు ఆకాంక్షించారు.​ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ.. పట్టణంలో భక్తి భావాన్ని చాటిచెప్పే ఇలాంటి కార్యక్రమాలకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. మే 10న జరిగే ఈ భారీ శోభాయాత్రకు రావాల్సిందిగా ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ని కనిగిరి పట్టణ టిడిపి అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ను కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు.​ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు
​వద్దిపాటి వెంకటేష్, ఈర్ల విజయరామరాజు
​కొబ్బరి బొండాల సుబ్బారావు, మల్లెల గోమ్స్ ​అభిలాష్, భాస్కర్, కోమటిగుంట్ల బాబురావు,పల్లా మాలకొండయ్య,​నవీన్, నల్లబోతుల దొరసాని, అచ్చాల తిరుపతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *